37 పేతురును, జెబెదయి ఇద్దరు కొడుకులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, కలతలో మునిగిపోయాడు. 38 అప్పుడు ఆయన వారితో, "నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది. మీరు ఇక్కడే నిలిచి నాతో కలిసి మెలకువగా ఉండండి" అని చెప్పాడు.
మొదటి ప్రార్థన
మార్కు 14:35; లూకా 22:41-42
39 ఆయన కొంత దూరం వెళ్ళి, సాగిలపడి, "నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయి. అయినా నీ ఇష్టమే నెరవేరాలి, నా ఇష్టం కాదు" అని ప్రార్థన చేశాడు.