Pular para o conteúdo
Publicidade

మత్తయి రాసిన సువార్త 27:3-7

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

3 అప్పుడు ఆయనను వారికి పట్టించి ఇచ్చిన యూదా, వారు ఆయనకు శిక్ష విధించడం చూసి పశ్చాత్తాపపడి, ఆ ముప్ఫై వెండి నాణాలు ప్రధాన యాజకుల, పెద్దల దగ్గరికి తీసుకొచ్చి, 4 "నేను నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి పాపం చేశాను" అని చెప్పాడు. అందుకు వారు, "ఐతే మాకేంటి? దాని సంగతి నువ్వే చూసుకో" అని చెప్పారు. 5 అప్పుడతడు ఆ వెండి నాణాలు దేవాలయంలో విసిరేసి, వెళ్ళి ఉరి వేసుకున్నాడు. 6 ముఖ్య యాజకులు ఆ వెండి నాణాలు తీసుకుని "ఇది రక్తం కొన్న డబ్బు. కాబట్టి దీన్ని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం" అని చెప్పుకున్నారు.

7 వారు ఆలోచించి ఆ సొమ్ముతో పరదేశులను పాతిపెట్టడం కోసం ఒక కుమ్మరి వాడి పొలం కున్నారు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    3 అప్పుడు యేసును అప్పగించిన యూదా, యేసుకు శిక్ష వేయడం చూసి, తాను చేసిన దోషాన్ని బట్టి పశ్చాత్తాపపడి, ఆ ముప్పై వెండి నాణాలను ముఖ్య యాజకులు యూదా నాయకులకు తిరిగి ఇవ్వడానికి వెళ్లాడు. 4 అతడు వారితో, "నేను ఒక నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి, పాపం చేశాను" అని అన్నాడు.

    అందుకు వారు, "దానితో మాకేంటి? అది నీ సమస్య" అని జవాబిచ్చారు.

    5 అప్పుడు యూదా ఆ వెండి నాణాలను దేవాలయంలో విసిరి వేసి అక్కడినుండి వెళ్లి, ఉరి వేసుకున్నాడు.

    6 ముఖ్య యాజకులు ఆ వెండి నాణాలను తీసుకుని, "ఇవి రక్తపు వెల కాబట్టి వీటిని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం" అని చెప్పి, 7 వారు ఆలోచించి ఆ డబ్బుతో విదేశీయులను సమాధి చేయడానికి ఒక కుమ్మరి వాని పొలం కొన్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.