Pular para o conteúdo
Publicidade

మత్తయి రాసిన సువార్త 4:5-7

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

5 అప్పుడు అపవాది ఆయనను పవిత్ర నగరంలోకి తీసుకు పోయి, దేవాలయ శిఖరంపై నిలబెట్టి, 6 "నీవు దేవుని కుమారుడివైతే కిందికి దూకు. ఎందుకంటే,

‘ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు.

నీ పాదానికి రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు’ అని రాసి ఉంది" అన్నాడు.

7 అందుకు యేసు "‘ప్రభువైన నీ దేవుణ్ణి నీవు పరీక్షించకూడదు’ అని కూడా రాసి ఉంది" అని అతనితో అన్నాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    5 అప్పుడు అపవాది ఆయనను పవిత్ర పట్టణానికి తీసుకుని వెళ్లి అక్కడ దేవాలయ శిఖరం మీద నిలబెట్టి, 6 "నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు. ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది:

    " ‘నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు,

    నీ పాదాలకు ఒక్క రాయి తగలకుండ,

    వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు’4:6 కీర్తన 91:11,12"

    అని అన్నాడు.

    7 అందుకు యేసు అతనితో, " ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’4:7 ద్వితీ 6:16 అని కూడా వ్రాయబడి ఉంది" అని అన్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.