Pular para o conteúdo
Publicidade

సంఖ్యాకాండం 14:1-4

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

ఇశ్రాయేలు ప్రజల తిరుగుబాటు

1 ఆ రాత్రి ప్రజలందరూ పెద్దగా కేకలు పెట్టి ఏడ్చారు. 2 ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులకు వ్యతిరేకంగా గొడవ చేశారు. 3 ఆ సమాజమంతా వారితో "ఈ అరణ్యంలో చనిపోవడం కన్నా మేము ఐగుప్తులో చనిపోతే బాగుండేది! మేము కత్తివాత చావాలని యెహోవా మమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొచ్చాడా? మా భార్యలు, మా చిన్న పిల్లలు బాధల పాలౌతారు. మళ్ళీ ఐగుప్తు తిరిగి వెళ్ళడం మాకు మేలు కాదా?" అన్నారు.

4 వారు "మనం ఇంకొక నాయకుణ్ణి ఎంపిక చేసుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్దాం పదండి" అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 ఆ రాత్రి సమాజంలో ఉన్న అందరు స్వరాలెత్తి బిగ్గరగా ఏడ్చారు. 2 ఇశ్రాయేలీయులందరు మోషే అహరోనుల మీద సణిగి, సమాజమంతా, "మేము ఈజిప్టులో గాని ఎడారిలో గాని చనిపోయుంటే బాగుండేది! 3 మేము ఖడ్గం చేత చావడానికి మమ్మల్ని యెహోవా ఈ దేశానికి ఎందుకు తెస్తున్నారు? మా భార్య పిల్లలు చెరగా కొనిపోబడతారు. ఈజిప్టుకు తిరిగి వెళ్లడం మాకు మంచిది కాదా?" అని వారితో అన్నారు. 4 వారు ఒకరితో ఒకరు, "మనం ఒక నాయకుని ఎన్నుకుని ఈజిప్టుకు తిరిగి వెళ్దాం" అని మాట్లాడుకున్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.