Pular para o conteúdo
Publicidade

రోమీయులకు రాసిన పత్రిక 10:13-17

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

13 ఎందుకంటే ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారందరికీ పాపవిమోచన కలుగుతుంది. 14 నమ్మని వాడికి వారు ఎలా ప్రార్థన చేస్తారు? తాము వినని వాడిపై ఎలా నమ్మకం పెట్టుకుంటారు? ఆయన్ని గురించి ప్రకటించేవాడు లేకుండా వారెలా వింటారు? 15 ప్రకటించే వారిని పంపకపోతే ఎలా ప్రకటిస్తారు? దీన్ని గురించి, "శ్రేష్ఠమైన వాటిని గురించిన శుభ సమాచారం అందించే వారి పాదాలు ఎంతో అందమైనవి" అని రాసి ఉంది. 16 అయితే అందరూ సువార్తకు లోబడలేదు. "ప్రభూ, మా సందేశాన్ని ఎవరు నమ్మారు?" అని యెషయా చెబుతున్నాడు కదా? 17 కాబట్టి వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినడం క్రీస్తు గురించిన మాట ద్వారా కలుగుతుంది.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    13 ఎందుకంటే, "ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు."10:13 యోవేలు 2:32

    14 అయితే, వారు తాము నమ్మని వానికి ఎలా మొరపెడతారు? తాము విననివానిని ఎలా నమ్ముతారు? వారికి ఎవరూ ప్రకటించకపోతే ఎలా వినగలరు? 15 ప్రకటించేవారిని పంపకపోతే ఎలా ప్రకటించగలరు? దీని గురించి, "సువార్తను తెచ్చేవారి పాదాలు ఎంతో అందమైనవి!"10:15 యెషయా 52:7 అని వ్రాయబడి ఉంది.

    16 అయితే, "ప్రభువా, మా సందేశాన్ని ఎవరు నమ్ముతారు?"10:16 యెషయా 53:1 అని యెషయా చెప్పిన ప్రకారం, సువార్తను ఇశ్రాయేలు ప్రజలందరూ అంగీకరించలేదు. 17 కాబట్టి, సువార్తను వినడం వలన విశ్వాసం కలుగుతుంది, క్రీస్తును గురించిన వాక్యం ద్వారా సువార్తను వినగలరు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.