Pular para o conteúdo
Publicidade

రోమీయులకు రాసిన పత్రిక 12:17-21

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

(4) క్రైస్తవులు, క్రైస్తవేతరులు

17 కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మనుషులందరి దృష్టిలో మేలు జరిగించండి. 18 మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండండి.

19 ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోవద్దు. దేవుని కోపానికి చోటియ్యండి. "పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు" అని రాసి ఉంది.

20 "కాబట్టి, నీ విరోధి ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికతో ఉంటే దాహం ఇవ్వు.

అలా చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతుంది."

21 కీడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. మేలుతో కీడును జయించండి.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    17 చెడుకు ప్రతిగా ఎవరికి చెడు చేయకండి. అందరి దృష్టికి సరియైనవిగా ఉన్నవాటిని చేసేలా జాగ్రత్తపడండి. 18 మీకు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి జీవించండి. 19 నా ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోకండి కాని, "పగ తీర్చుకోవడం నా పని, వారికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తానని12:19 ద్వితీ 32:35 ప్రభువు చెప్పారు" అని వ్రాయబడిన ప్రకారం దేవుని ఉగ్రతకు విడిచిపెట్టండి. 20 అయితే,

    "మీ శత్రువు ఆకలితో ఉంటే వానికి ఆహారం పెట్టండి;

    అతడు దాహంతో ఉంటే వానికి త్రాగడానికి ఇవ్వండి.

    మీరు ఇలా చేయడం ద్వారా అతని తలపై మండుతున్న నిప్పులు కుప్పగా పోస్తారు."12:20 సామెత 25:21,22

    21 చెడును మీమీద గెలవనివ్వక, మంచితో చెడును ఓడించండి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.