Pular para o conteúdo
Publicidade

రోమీయులకు రాసిన పత్రిక 8:14-16

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

నాలుగవ భాగం-సువార్త వలన కలిగే పరిపూర్ణమైన ఫలితం

(1) విశ్వాసి కుమారునిగా, వారసునిగా అవుతాడు

14 దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు. 15 ఎందుకంటే, మళ్లీ భయపడడానికి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం, "అబ్బా! తండ్రీ!" అని దేవుణ్ణి పిలుస్తున్నాం. 16 మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    14 ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు. 15 మీరు మరలా భయంలో జీవించడానికి, మీరు పొందిన ఆత్మ మిమ్మల్ని బానిసలుగా చేయదు కాని మీరు పొందిన ఆత్మ ద్వారా దత్తపుత్రులుగా చేయబడతారు. అప్పుడు ఆ ఆత్మ ద్వారా మనం, "అబ్బా, తండ్రీ" అని మొరపెడుతున్నాము. 16 మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.