Pular para o conteúdo
Publicidade

రూతు 4:13-22

ఓబేదు పుట్టుక, దావీదు వంశక్రమం

13 బోయజు రూతును పెళ్ళి చేసుకున్నాడు. ఆమెను ప్రేమించాడు. యెహోవా ఆమెను దీవించాడు. ఆమె గర్భవతి అయి ఒక కొడుకును కన్నది. 14 అప్పుడు అక్కడి స్త్రీలు "ఈ రోజు నీవు బంధువులు లేని దానిగా మిగిలిపోకుండా చేసిన యెహోవాకు స్తుతులు. ఆయన పేరు ఇశ్రాయేలీయుల్లో ప్రఖ్యాతి చెందుతుంది గాక. 15 నిన్ను ప్రేమించి ఏడుగురు కొడుకుల కంటే మించిన నీ కోడలు వీణ్ణి కన్నది. ఇతడు నీ ప్రాణాన్ని ఉద్ధరిస్తాడు. వృద్ధాప్యంలో నిన్ను పోషిస్తాడు" అని నయోమితో చెప్పారు.

16 అప్పుడు నయోమి ఆ బిడ్డను తన కౌగిట్లోకి తీసుకుని వాడికి సంరక్షకురాలు అయింది. 17 ఆమె ఇరుగు పొరుగు స్త్రీలు నయోమికి కొడుకు పుట్టాడని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఇతడు దావీదు తండ్రి అయిన యెష్షయికి తండ్రి.

18 పెరెసు వంశక్రమం ఇది. పెరెసు కుమారుడు హెస్రోను. 19 హెస్రోను కుమారుడు రము. రము కుమారుడు అమ్మీనాదాబు. 20 అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను. 21 శల్మాను కుమారుడు బోయజు. బోయజు కుమారుడు ఓబేదు. 22 ఓబేదు కుమారుడు యెష్షయి. యెష్షయి కుమారుడు దావీదు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Rute
Ver todos os capítulos de Rute