Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 139:13-18

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

13 దేవా, నా లోపలి భాగాలను నువ్వే నిర్మించావు. నా తల్లి గర్భంలో నన్ను రూపొందించావు.

14 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నీవు నన్ను తయారు చేసిన విధానం దిగ్భ్రమ కలిగించేది, అద్భుతమైనది. నా జీవితం నీకు బాగా తెలుసు.

15 నేను రహస్యంగా తయారౌతున్నప్పుడు, నా స్వరూపం భూమి అగాధస్థలాల్లో విచిత్రంగా నిర్మితమౌతున్నప్పుడు నా శరీరమంతా నీకు తేట తెల్లమే.

16 నేను పిండంగా ఉన్నప్పుడే నీ కళ్ళు నన్ను చూశాయి. నాకు నియమితమైన రోజుల్లో ఒకటైనా గడవక ముందే నా రోజులన్నీ నీ గ్రంథంలో రాసి ఉన్నాయి.

17 దేవా, నీ ఆలోచనలు నాకెంతో ప్రశస్తమైనవి. వాటి మొత్తం ఎంతో గొప్పది.

18 వాటిని లెక్కపెడదామనుకుంటే అవి ఇసక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయి. నిద్ర మేల్కొన్నప్పుడు నేనింకా నీ దగ్గరే ఉన్నాను.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    13 నా అంతరంగాన్ని మీరు సృష్టించారు;

    నా తల్లి గర్భంలో మీరు నన్ను ఒక్కటిగా అల్లారు.

    14 నేను అద్భుతంగా, ఆశ్చర్యంగా సృజించబడ్డాను కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.

    మీ క్రియలు ఆశ్చర్యకరమైనవి,

    అది నాకు పూర్తిగా తెలుసు.

    15 రహస్య స్థలంలో నేను రూపొందించబడినప్పుడు,

    భూమి అగాధ స్థలాల్లో నేను ఒక్కటిగా అల్లబడినప్పుడు,

    నా రూపము మీ నుండి మరుగు చేయబడలేదు.

    16 నేను పిండంగా ఉన్నప్పుడు మీ కళ్లు నన్ను చూశాయి;

    నాకు నియమించబడిన రోజుల్లో ఒక్కటైనా రాకముందే

    అవన్నీ మీ గ్రంథంలో వ్రాయబడ్డాయి.

    17 దేవా, మీ ఆలోచనలు139:17 నా గురించిన మీ ఆలోచనలు ఎంత అద్భుతం! నాకెంతో అమూల్యమైనవి!

    వాటి మొత్తం ఎంత విస్తారమైనది!

    18 వాటిని లెక్కించడానికి నేను ప్రయత్నిస్తే,

    అవి ఇసుకరేణువుల కంటే లెక్కకు మించినవి,

    నేను మేల్కొనినప్పుడు నేను ఇంకా మీ దగ్గరే ఉన్నాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.