Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 37:3,7,11,25

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

3 యెహోవాలో నమ్మకం ఉంచు. ఏది మంచిదో దాన్నే చెయ్యి. దేశంలో స్థిరపడి విశ్వసనీయతను ఆచరించు.

7 యెహోవా ఎదుట మౌనంగా ఉండు. సహనంతో ఆయన కోసం వేచి ఉండు. దుర్మార్గాలు చేసి ఎవరన్నా విజయం సాధిస్తే చింతించకు. ఎవరన్నా కుట్రలు చేస్తే విచారించకు.

11 నమ్రత గలవాళ్ళు భూమిని స్వాధీనం చేసుకుంటారు. గొప్ప సమృద్ధి కలిగి సంతోషిస్తారు.

25 నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను. ఇప్పుడు పెద్దవాణ్ణి అయ్యాను. అయితే నీతిమంతుడు అనాథ కావడం గానీ, లేదా అతడి పిల్లలు అడుక్కోవడం గానీ నేను చూడలేదు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    3 యెహోవా మీద నమ్మకం ఉంచి మంచి చేయి;

    దేశంలో నివసించి సురక్షితమైన క్షేమకరమైన పచ్చికను ఆస్వాదించు.

    7 యెహోవా ముందు మౌనంగా ఉండు

    ఆయన కోసం ఓర్పుతో వేచి ఉండు.

    ప్రజలు వారి మార్గాల్లో విజయవంతమైనప్పుడు

    వారు తమ దుష్ట పన్నాగాలు అమలు చేసినప్పుడు చింతించకు.

    11 కాని సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు

    సమాధానం అభివృద్ధి కలిగి జీవిస్తారు.

    25 ఒకప్పుడు నేను యవ్వనస్థుడను ఇప్పుడు ముసలివాడినయ్యాను,

    అయినాసరే నీతిమంతులు విడిచిపెట్టబడడం

    వారి పిల్లలు ఆహారం అడుక్కోవడం నేనెప్పుడు చూడలేదు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.