Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 46:1-3,6,10

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

1 దేవుడు మన ఆశ్రయం. మన బలం. సమస్యల్లో మన తక్షణ సహాయం.

2 కాబట్టి భూమి మారిపోయినా, సముద్ర అఖాతంలో పర్వతాలు మునిగిపోయినా మేము భయపడం.

3 సముద్రంలో నీళ్ళు గర్జించినా, తీవ్ర ఉద్రేకంతో అవి పొంగినా, వాటి పొంగుకు పర్వతాలు కంపించినా సరే. సెలా.

6 జాతులు ఘోషిస్తున్నాయి. రాజ్యాలు కంపిస్తున్నాయి. ఆయన తన స్వరాన్ని పెంచినప్పుడు భూమి కరిగిపోయింది.

10 నిశ్శబ్దంగా ఉండండి. నేనే యెహోవాని అని తెలుసుకోండి. జనాలలో నన్ను హెచ్చిస్తారు. భూమిపై నన్ను ఉన్నత స్థానంలో ఉంచుతారు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 దేవుడు మనకు ఆశ్రయం బలం,

    ఇబ్బందిలో ఎప్పుడు ఉండే సహాయం

    2 కాబట్టి భూమి మార్పుచెందినా,

    నడిసముద్రంలో పర్వతాలు మునిగినా, మేము భయపడము.

    3 జలాలు గర్జించినా నురుగు కట్టినా

    పర్వతాలు వాటి పెరుగుదలతో కదిలినా మేము భయపడము. సెలా

    6 దేశాలు గందరగోళంలో ఉన్నాయి, రాజ్యాలు కూలిపోతాయి;

    దేవుని స్వరం ఉరుముతుంది, భూమి కరుగుతుంది.

    10 "ఊరకుండండి, నేనే దేవున్ని అని తెలుసుకోండి;

    దేశాల్లో నేను హెచ్చింపబడతాను,

    భూమి మీద నేను హెచ్చింపబడతాను."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.