నాయకులను బట్టి సంఘంలో విభేదాలు
10 సహోదరీ సహోదరులారా,1:10 దేవుని కుటుంబానికి చెందిన స్త్రీ పురుషులైన విశ్వాసులకు వర్తిస్తుంది. మీ మధ్య భేదాలు లేకుండ మీ మనస్సులోను ఆలోచనలోను పరిపూర్ణ ఏకత్వంతో ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. 11 నా సహోదరీ సహోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారిలో కొందరు నాకు తెలియజేశారు. 12 నేను చెప్పేది ఏంటంటే: మీలో "నేను పౌలును అనుసరిస్తున్నానని" ఒకరు, "నేను అపొల్లోను అనుసరిస్తున్నానని" వేరొకరు, "నేను కేఫాను1:12 అంటే, పేతురును అనుసరిస్తున్నానని" మరొకరు, "నేను క్రీస్తును అనుసరిస్తున్నానని" మరి ఇంకొకరు చెప్పుకుంటున్నారని విన్నాను.