ప్రభురాత్రి భోజనం యొక్క దుర్వినియోగాన్ని సరిదిద్దుట
17 ఈ ఆజ్ఞలు ఇస్తూ నేను మిమ్మల్ని మెచ్చుకోను, ఎందుకంటే మీ సమావేశాలు మంచి కంటే చెడునే ఎక్కువగా చేస్తున్నాయి. 20 అయితే మీరు సమావేశమైనప్పుడు మీరు తినేది ప్రభువు రాత్రి భోజనం కాదు. 21 ఎందుకంటే, మీరు తింటున్నప్పుడు, మీలో కొందరు తమ భోజనాన్ని ముందుగానే చేసేస్తున్నారు. దాని ఫలితంగా ఒకరు ఆకలితో ఉండగా మరొకరు మత్తులై పోతున్నారు. 22 తినడానికి, త్రాగడానికి మీకు ఇల్లు లేవా? లేదా ఏమి లేనివారిని అవమానించడం ద్వారా మీరు దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? నేను మీకు ఏమి చెప్పాలి? మిమ్మల్ని పొగడాలా? ఈ విషయంలో ఖచ్చితంగా మెచ్చుకోలేను.
27 కాబట్టి, ఎవరైతే అయోగ్యంగా ప్రభువు రొట్టెను తిని, ఆయన పాత్రలోనిది త్రాగుతారో వారు ప్రభువు శరీరం, ఆయన రక్తం గురించి అపరాధులవుతారు. 29 ఎందుకంటే, ఎవరైనా ప్రభువు శరీరమని వివేచించకుండా ఆ రొట్టెను తిని, పాత్రలోనిది త్రాగితే వారు తమపైకి తామే తీర్పు తెచ్చుకోవడానికే తిని త్రాగుతున్నారు. 30 ఈ కారణంగానే, మీలో చాలామంది వ్యాధిగ్రస్తులుగా, బలహీనులుగా ఉన్నారు, చాలామంది మరణిస్తున్నారు.
33 కాబట్టి, సహోదరీ సహోదరులారా! మీరు భోజనం చేయడానికి చేరినప్పుడు మీరందరు కలిసి భోజనం చేయండి.