1 మానవుల లేదా దేవదూతల భాషలు నేను మాట్లాడ కలిగినా, నాకు ప్రేమ లేకపోతే కేవలం మ్రోగే గంటలా గణగణ మ్రోగించే తాళంలా ఉంటాను. 2 నేను ప్రవచన వరాన్ని కలిగినా, అన్ని రహస్యాలను అర్థం చేసికోగలిగినా, సమస్త జ్ఞానం కలిగి ఉన్నా, పర్వతాలను కూడా కదిలించగల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థమే. 3 నాకున్న సంపాదనంతా పేదలకు ఇచ్చివేసి, మెప్పు కోసం నా శరీరాన్ని కష్టానికి అప్పగించినా నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం ఏమి లేదు.
4 ప్రేమే సహనం, ప్రేమే దయ, అది అసూయ లేనిది, అది హెచ్చించుకోదు, గర్వం లేనిది. 5 అది ఇతరులను అగౌరపరచదు, స్వార్థం లేనిది, త్వరగా కోప్పడదు, తప్పులను జ్ఞాపకం ఉంచుకోదు. 6 ప్రేమ చెడుతనంలో ఆనందించదు కాని సత్యంలో ఆనందిస్తుంది. 7 అది అన్నిటిని కాపాడుతుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని సహిస్తుంది.