2 రాజైన దావీదు లేచి నిలబడి ఇలా అన్నాడు: "నా తోటి ఇశ్రాయేలీయులారా, నా ప్రజలారా, వినండి. మన దేవునికి పాదపీఠంగా యెహోవా నిబంధన మందసాన్ని ఉంచే మందిరాన్ని నేను నిర్మించాలని నా హృదయంలో అనుకున్నాను, దాన్ని కట్టడానికి సన్నాహాలు చేశాను. 3 అయితే దేవుడు నాతో, ‘నీవు యుద్ధాలు చేసి రక్తం చిందించావు కాబట్టి, నీవు నా పేరిట మందిరాన్ని కట్టించకూడదు’ అని చెప్పారు.
6 ఆయన నాతో ఇలా అన్నారు: ‘నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఎన్నుకున్నాను, నేను అతనికి తండ్రిగా ఉంటాను కాబట్టి అతడు నా మందిరాన్ని, ఆవరణాలను కట్టిస్తాడు.