Pular para o conteúdo
Publicidade

1 యోహాను పత్రిక 2:12-15

OTSA Telugu Contemporary Version

వ్రాయడానికి గల కారణాలు

12 ప్రియ పిల్లలారా, ఆయన నామంలో మీ పాపాలు క్షమించబడ్డాయి,

కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

13 తండ్రులారా, ఆది నుండి ఉన్నవాడు మీకు తెలుసు,

కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

యవ్వనస్థులారా, మీరు దుష్టుని జయించారు,

కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

14 ప్రియ బిడ్డలారా, మీకు తండ్రి తెలుసు,

కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

తండ్రులారా, ఆది నుండి ఉన్నవాడు మీకు తెలుసు,

కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

యవ్వనస్థులారా, మీరు బలవంతులు,

దేవుని వాక్యం మీలో నివసిస్తున్నది;

మీరు దుష్టుని జయించారు;

కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

లోకాన్ని ప్రేమించరాదు

15 ఈ లోకాన్ని లోకంలో ఉన్న దేన్ని ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి పట్ల ప్రేమ2:15 ప్రేమ లేదా తండ్రి ప్రేమ వారిలో ఉండదు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    12 ప్రియమైన చిన్నపిల్లలారా! క్రీస్తు నామంలో మీ పాపాలకు క్షమాపణ దొరికింది కాబట్టి మీకు రాస్తున్నాను.

    13 తండ్రులారా, ఆరంభం నుంచీ ఉన్నవాడు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు సైతానుని ఓడించారు కాబట్టి మీకు రాస్తున్నాను.

    14 చిన్నపిల్లల్లారా, మీరు తండ్రిని తెలుసుకుని ఉన్నారు కాబట్టి మీకు రాస్తున్నాను.

    తండ్రులారా, ఆరంభం నుంచీ ఉన్నవాడు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను.

    యువకులారా, మీరు బలవంతులు, దేవుని వాక్కు మీలో నిలిచి ఉంది, మీరు సైతానును ఓడించారు, అందుకే మీకు రాస్తున్నాను.

    15 ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.