Pular para o conteúdo
Publicidade

1 రాజులు 19:4-9

OTSA Telugu Contemporary Version

4 అతడు మాత్రం ఎడారిలోకి రోజంతా ప్రయాణం చేశాడు. ఒక బదరీచెట్టు క్రింద కూర్చుని చనిపోవాలని కోరుతూ, "యెహోవా, నా ప్రాణం తీసుకోండి; నేను నా పూర్వికులకంటే గొప్పవాన్ని కాను" అని ప్రార్థించాడు. 5 తర్వాత అతడు ఆ బదరీచెట్టు క్రింద పడుకుని నిద్రపోయాడు.

అప్పుడు అకస్మాత్తుగా ఒక దేవదూత అతన్ని తట్టి, "లేచి తిను" అన్నాడు. 6 అతడు కళ్లు తెరిచి చూస్తే అతని తల దగ్గర సీసాలో నీళ్లు నిప్పుల మీద కాల్చిన రొట్టె కనిపించాయి. అతడు తిని త్రాగి మళ్ళీ పడుకున్నాడు.

7 తర్వాత యెహోవా దూత రెండవసారి వచ్చి అతన్ని తట్టి, "లేచి తిను ఎందుకంటే నీవు దూర ప్రయాణం చేయాల్సి ఉంది" అన్నాడు. 8 కాబట్టి అతడు లేచి తిని నీళ్లు త్రాగాడు. ఆ ఆహారం వల్ల బలం పొందుకొని నలభై రాత్రింబగళ్ళు ప్రయాణించి దేవుని పర్వతమైన హోరేబును చేరుకున్నాడు. 9 అక్కడ అతడు ఒక గుహలో ఆ రాత్రి గడిపాడు.

యెహోవా ఏలీయాకు ప్రత్యక్షమగుట

యెహోవా వాక్కు, "ఏలీయా, ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని అతన్ని అడిగింది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    4 అతడు ఒక రోజంతా ఎడారిలోకి ప్రయాణించి ఒక రేగు చెట్టు కింద కూర్చున్నాడు. చచ్చిపోదామని ఆశించాడు. "యెహోవా, ఇంతవరకూ చాలు, చనిపోయిన నా పూర్వీకుల కంటే నేనేమంత గొప్పవాణ్ణి కాదు. నా ప్రాణం తీసుకో" అని ప్రార్థన చేశాడు. 5 అతడు రేగు చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఉన్నట్టుండి ఒక దేవదూత వచ్చి అతన్ని తాకి "నీవు లేచి భోజనం చెయ్యి" అన్నాడు. 6 ఏలీయా లేచి చూస్తే, అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిన రొట్టె, నీళ్ల సీసా కనిపించాయి. కాబట్టి అతడు భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు.

    7 యెహోవా దూత రెండవసారి మళ్ళీ వచ్చి అతన్ని లేపి "నీవు చాలా దూరం ప్రయాణం చెయ్యాలి, లేచి భోజనం చెయ్యి" అని చెప్పాడు. 8 అతడు లేచి తిని, తాగి ఆ భోజనం బలంతో నలభై రాత్రింబగళ్లు ప్రయాణించి దేవుని పర్వతమనే పేరున్న హోరేబుకు వచ్చాడు.

    9 అక్కడున్న ఒక గుహలో ఉండిపోయాడు. యెహోవా "ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్" అని అతనిని అడిగాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.