సొలొమోను జ్ఞానం
29 దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్ని గొప్ప వివేచనను, సముద్రతీరంలోని కొలవలేని ఇసుకరేణువులంత ప్రసాదించారు. 30 సొలొమోను జ్ఞానం తూర్పు దేశాల వారందరి జ్ఞానం కంటే, ఈజిప్టులోని జ్ఞానమంతటి కంటే గొప్పది. 31 అతడు మనుష్యులందరి కంటే జ్ఞాని, ఎజ్రాహీయుడైన ఏతాను కంటే, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద కంటే జ్ఞాని. అతని కీర్తి చుట్టూ ఉన్న అన్ని దేశాలకు వ్యాపించింది. 32 అతడు 3,000 సామెతలు పలికాడు, 1,005 కీర్తనలు వ్రాశాడు. 33 అతడు లెబానోనులో ఉండే దేవదారు చెట్ల నుండి, గోడల నుండి మొలిచే హిస్సోపు మొక్కల వరకు చెట్ల గురించి వివరించాడు. అతడు జంతువులు, పక్షులు, ప్రాకే జంతువులు, చేపల గురించి కూడా వివరించాడు. 34 అతని జ్ఞానం గురించి విన్న భూరాజులందరి ద్వారా అన్ని దేశాల నుండి రాయబారులు వచ్చి సొలొమోను జ్ఞాన వాక్కులను వినేవారు.