10 హన్నా తీవ్ర వేదనలో ఏడుస్తూ యెహోవాకు ప్రార్థించింది. 11 ఆమె, "సైన్యాల యెహోవా, మీరు మీ సేవకురాలినైన కష్టాలను చూసి నన్ను గుర్తుంచుకుని, మీ సేవకురాలినైన నన్ను మరచిపోకుండా నాకు ఒక కుమారున్ని ఇస్తే, అతడు బ్రతికే దినాలన్ని యెహోవాకే ఇస్తాను, అతని తలపై క్షౌరపుకత్తి ఎప్పుడూ ఉపయోగించబడదు" అని అంటూ ఒక మ్రొక్కుబడి చేసింది.
13 హన్నా తన హృదయంలో ప్రార్థన చేస్తోంది, ఆమె పెదవులు కదులుతున్నాయి కానీ ఆమె స్వరం వినబడలేదు. ఏలీ ఆమె త్రాగి ఉందని భావించి, 14 ఏలీ ఆమెతో, "ఎంతకాలం నీవు మత్తులో ఉంటావు? నీ ద్రాక్షరసాన్ని దూరం పెట్టు" అన్నాడు.
15 అందుకు హన్నా, "అలా కాదు, నా ప్రభువా, నేను చాలా బాధలో ఉన్నాను. నేను ద్రాక్షరసం గాని మద్యం గాని త్రాగలేదు; నేను నా ఆత్మను యెహోవా దగ్గర క్రుమ్మరిస్తున్నాను.
20 అలా కొంతకాలం గడిచాక హన్నా గర్భవతియై ఒక కుమారుని కన్నది. "నేను అతని కోసం యెహోవాను అడిగాను" అని అంటూ ఆమె అతనికి సమూయేలు1:20 సమూయేలు అంటే దేవుడు విన్నారు అని పేరు పెట్టింది.
27 నేను ఈ బిడ్డ కోసం ప్రార్థించాను, నేను యెహోవాను ఏమి అడిగానో, ఆయన నాకు అదే ఇచ్చారు. 28 కాబట్టి ఇప్పుడు నేను ఈ బిడ్డను తిరిగి యెహోవాకు ఇస్తున్నాను. వాడు జీవించినంత కాలం యెహోవాకు ప్రతిష్ఠితుడై ఉంటాడు" అని చెప్పింది. అప్పుడు ఆ చిన్నవాడు అక్కడే యెహోవాను ఆరాధించాడు.