Pular para o conteúdo
Publicidade

1 సమూయేలు 1:22-24

OTSA Telugu Contemporary Version

22 హన్నా వెళ్లలేదు. ఆమె తన భర్తతో ఇలా చెప్పింది: "బాలుడు పాలు విడిచిన తర్వాత, నేను అతన్ని తీసుకెళ్లి యెహోవా ముందు ఉంచుతాను, ఇక అతడు ఎప్పుడూ అక్కడే ఉంటాడు."

23 "నీకు ఏది మంచిదో అది చేయి, వానిని పాలు మాన్పించేవరకు నీవు ఇక్కడే ఉండు; యెహోవా తన మాట నెరవేర్చును గాక" అని ఆమె భర్తయైన ఎల్కానా ఆమెతో చెప్పాడు. కాబట్టి ఆ స్త్రీ తన కుమారుని పాలు మాన్పించేవరకు ఇంట్లోనే ఉండి వానిని పోషించింది.

24 వాడు పాలు విడిచిన తర్వాత, వాడు చిన్నవాడిగా ఉండగానే ఆమె తనతో పాటు మూడు సంవత్సరాల ఎద్దును, ఒక ఏఫా1:24 అంటే, బహుశ 16 కి. గ్రా. లు పిండిని, ద్రాక్షతిత్తిని తీసుకుని షిలోహులో ఉన్న యెహోవా మందిరానికి తీసుకెళ్లింది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    22 అయితే హన్నా "బిడ్డ పాలు మానే వరకూ నేను రాను, వాడు యెహోవా సన్నిధిలో కనపడి మళ్ళీ తిరిగి రాకుండా అక్కడే ఉండేలా నేను వాణ్ణి తీసుకువస్తాను" అని తన భర్తతో చెప్పి మందిరానికి వెళ్ళలేదు. 23 అప్పుడు ఆమె భర్త ఎల్కానా "నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. నువ్వు వాడికి పాలు మాన్పించే వరకూ రావద్దు. యెహోవా తన వాక్కును స్థిరపరుస్తాడు గాక" అని ఆమెతో అన్నాడు. ఆమె అక్కడే ఉండిపోయి తన కొడుకు పాలు మానేవరకూ అతన్ని పెంచుతూ ఉంది.

    24 పాలు మానిన తరువాత బాలుడు ఇంకా పసి వాడుగా ఉన్నప్పుడే ఆమె అతణ్ణి ఎత్తుకుని మూడేళ్ళ కోడెదూడ, తూమెడు పిండి, ద్రాక్షారసం తిత్తిని తీసుకు షిలోహులోని మందిరానికి వచ్చింది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.