Pular para o conteúdo
Publicidade

1 సమూయేలు 15:1,3,9,13,15,22,23

యెహోవా సౌలును రాజుగా తిరస్కరించుట

1 ఒక రోజు సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు, "యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నిన్ను రాజుగా అభిషేకించడానికి నన్ను పంపించారు; ఇప్పుడు యెహోవా పంపిన సందేశాన్ని విను. 3 కాబట్టి నీవు ఇప్పుడు వెళ్లి అమాలేకీయుల మీద దాడిచేసి వారికి చెందిన వాటన్నిటిని నాశనం చేయాలి.15:3 ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు అప్పగించడాన్ని సూచిస్తుంది, తరచుగా వాటిని పూర్తిగా నాశనం చేయడమే; 8, 9, 15, 18, 20, 21. వారిని విడిచిపెట్టవద్దు; పురుషులను స్త్రీలను, పిల్లలను చంటిబిడ్డలను, పశువులను గొర్రెలను, ఒంటెలను, గాడిదలనన్నిటిని చంపివేయాలి.’ "

9 అయితే సౌలు అతని సైన్యం అగగును, గొర్రెలలో పశువుల్లో మంచివాటిని క్రొవ్విన దూడలను15:9 లేదా ఎదిగిన కోడెలు; హెబ్రీ భాషలో ఈ పదం యొక్క ఖచ్చితమైన అర్థం తెలియదు గొర్రెపిల్లలను నాశనం చేయక పనికిరాని వాటిని బలహీనమైన వాటిని పూర్తిగా నాశనం చేశారు.

13 తర్వాత సమూయేలు సౌలు దగ్గరకు వచ్చినప్పుడు సౌలు, "యెహోవా నిన్ను దీవిస్తారు! యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను" అన్నాడు.

15 అందుకు సౌలు, "అమాలేకీయుల దగ్గర నుండి సైన్యం వాటిని తీసుకువచ్చారు. నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి వారు గొర్రెలలో పశువుల్లో మంచి వాటిని వేరుగా ఉంచారు; మిగిలిన వాటన్నిటిని మేము పూర్తిగా నాశనం చేశాము" అని జవాబు ఇచ్చాడు.

22 అందుకు సమూయేలు ఇలా అన్నాడు:

"ఒకడు తన మాటకు లోబడితే యెహోవా సంతోషించినంతగా,

దహనబలులు బలులు అర్పిస్తే ఆయన సంతోషిస్తారా?

ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం

పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినడం ఎంతో మంచిది

23 తిరుగుబాటు చేయడం భవిష్యవాణి చెప్పడమనే పాపంతో సమానం

అహంకారం విగ్రహారాధనలోని చెడుతనంతో సమానము.

యెహోవా ఆజ్ఞను నీవు తిరస్కరించావు

కాబట్టి ఆయన నిన్ను రాజుగా తిరస్కరించారు."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.