9 అయితే సౌలు అతని సైన్యం అగగును, గొర్రెలలో పశువుల్లో మంచివాటిని క్రొవ్విన దూడలను15:9 లేదా ఎదిగిన కోడెలు; హెబ్రీ భాషలో ఈ పదం యొక్క ఖచ్చితమైన అర్థం తెలియదు గొర్రెపిల్లలను నాశనం చేయక పనికిరాని వాటిని బలహీనమైన వాటిని పూర్తిగా నాశనం చేశారు.
20 అందుకు సౌలు సమూయేలుతో, "ఆ మాట అనవద్దు: నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గంలో వెళ్లి నేను అమాలేకీయులనందరిని పూర్తిగా నాశనం చేసి అమాలేకీయుల రాజైన అగగును తీసుకువచ్చాను. 21 అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి సైనికులు దోచుకున్న గొర్రెలలో పశువుల్లో మంచివి, దేవుని కోసం ప్రతిష్ఠించబడిన వాటిని తీసుకువచ్చారు" అని చెప్పాడు.
22 అందుకు సమూయేలు ఇలా అన్నాడు:
"ఒకడు తన మాటకు లోబడితే యెహోవా సంతోషించినంతగా,
దహనబలులు బలులు అర్పిస్తే ఆయన సంతోషిస్తారా?
ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం
పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినడం ఎంతో మంచిది
23 తిరుగుబాటు చేయడం భవిష్యవాణి చెప్పడమనే పాపంతో సమానం
అహంకారం విగ్రహారాధనలోని చెడుతనంతో సమానము.
యెహోవా ఆజ్ఞను నీవు తిరస్కరించావు
కాబట్టి ఆయన నిన్ను రాజుగా తిరస్కరించారు."