Pular para o conteúdo
Publicidade

1 సమూయేలు 16:1,6,10-13

OTSA Telugu Contemporary Version

సమూయేలు దావీదును అభిషేకించుట

1 యెహోవా సమూయేలుతో, "ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను తిరస్కరించిన సౌలు గురించి నీవెంత కాలం దుఃఖపడతావు? నీ కొమ్మును నూనెతో నింపి నీవు బయలుదేరు; బేత్లెహేమీయుడైన యెష్షయి దగ్గరకు నేను నిన్ను పంపిస్తున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా ఏర్పరచుకున్నాను" అన్నారు.

6 వారు వచ్చినప్పుడు సమూయేలు ఏలీయాబును చూసి, "ఖచ్చితంగా యెహోవా అభిషేకించినవాడు యెహోవా ఎదుట నిలబడ్డాడు" అనుకున్నాడు.

10 అలా యెష్షయి తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుట నిలబెట్టాడు కాని సమూయేలు, "యెహోవా వీరెవరిని ఎంచుకోలేదు" అని చెప్పి, 11 నీ కుమారులంతా వీరేనా? అని యెష్షయిని అడిగాడు.

అందుకు యెష్షయి, ఇంకా చివరివాడున్నాడు. అయితే వాడు గొర్రెలు కాస్తున్నాడని చెప్పాడు.

అందుకు సమూయేలు, "అతన్ని పిలిపించు; అతడు వచ్చేవరకు మనం భోజనం చేయము" అన్నాడు.

12 కాబట్టి యెష్షయి అతన్ని పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు ఎర్రగా అందమైన కళ్లతో మంచి రూపంతో ఉన్నాడు.

అప్పుడు యెహోవా, "నేను ఎన్నుకున్నది ఇతన్నే, నీవు లేచి అతన్ని అభిషేకించు" అన్నారు.

13 కాబట్టి సమూయేలు నూనె కొమ్మును తీసుకుని అతని సోదరుల ఎదుట అతన్ని అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చేది. ఆ తర్వాత సమూయేలు రామాకు వెళ్లిపోయాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు "ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను తిరస్కరించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్మును నూనెతో నింపు, బేత్లెహేముకు చెందిన యెష్షయి దగ్గరకి నిన్ను పంపిస్తున్నాను. అతని కొడుకుల్లో ఒకడిని నేను రాజుగా ఎంపిక చేశాను."

    6 వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూసి "నిజంగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదురుగా నిలబడి ఉన్నాడు" అని అనుకున్నాడు.

    10 యెష్షయి తన ఏడుగురు కొడుకులనూ సమూయేలు ముందుకి రప్పించాడు. సమూయేలు "యెహోవా వీరిలో ఎవరినీ ఎన్నుకోలేదు" అని చెప్పి, 11 "నీ కొడుకులందరూ ఇక్కడే ఉన్నారా?" అని యెష్షయిని అడిగాడు. అతడు "ఇంకా చివరివాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను మేపడానికి వెళ్ళాడు" అని చెప్పాడు. అందుకు సమూయేలు "నువ్వు అతనికి కబురు పంపి ఇక్కడికి రప్పించు. అతడు వచ్చేదాకా మనం కూర్చోలేం కదా" అని యెష్షయితో చెప్పాడు.

    12 యెష్షయి అతణ్ణి పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు రూపంలో ఎర్రని వాడు, చక్కని కళ్ళు కలిగి చూపులకు అందమైనవాడు. అతడు రాగానే "నేను కోరుకొన్నది ఇతడే, నీవు లేచి అతణ్ణి అభిషేకించు" అని యెహోవా చెప్పగానే, 13 సమూయేలు నూనె కొమ్మును తీసి అతని తలపై నూనె పోసి అతని అన్నల ముందు అతణ్ణి అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదును తీవ్రంగా ఆవహించాడు. తరువాత సమూయేలు లేచి రమాకు వెళ్లిపోయాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.