దావీదు గురించి సౌలులో పెరుగుతున్న భయం
1 దావీదు సౌలుతో మాట్లాడడం పూర్తయిన తర్వాత యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయింది. యోనాతాను దావీదును ప్రాణానికి ప్రాణంగా భావించి అతన్ని ప్రేమించాడు. 3 యోనాతాను దావీదును తన ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి అతడు దావీదుతో ఒక నిబంధన చేసుకున్నాడు. 4 యోనాతాను తాను కప్పుకుని ఉన్న వస్త్రాన్ని, దానితో పాటు తన కత్తిని విల్లును నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు.