Pular para o conteúdo
Publicidade

1 సమూయేలు 19:11-18

11 ఉదయానే దావీదును చంపాలని అతన్ని పట్టుకోమని చెప్పి సౌలు అతని ఇంటికి దూతలను పంపించాడు. అయితే దావీదు భార్యయైన మీకాలు, "ఈ రాత్రి నీవు పారిపోయి ప్రాణం కాపాడుకోకపోతే రేపు నిన్ను చంపేస్తారు" అని హెచ్చరించి, 12 మీకాలు దావీదును కిటికీ గుండా క్రిందకు దింపితే అతడు తప్పించుకుని పారిపోయాడు. 13 తర్వాత మీకాలు ఒక విగ్రహాన్ని తీసుకువచ్చి మంచం మీద పెట్టి తల దగ్గర మేక వెంట్రుకలు ఉంచి దుప్పటితో దానిని కప్పింది.

14 సౌలు దావీదును పట్టుకోడానికి దూతలను పంపినప్పుడు మీకాలు, "అతడు అనారోగ్యంగా ఉన్నాడు" అని చెప్పింది.

15 సౌలు దావీదును చూడడానికి మళ్ళీ దూతలను పంపుతూ వారితో, "అతన్ని మంచంతో సహా తీసుకురండి నేను అతన్ని చంపుతాను" అన్నాడు. 16 అయితే ఆ దూతలు లోపలికి వచ్చి చూసినప్పుడు తల దగ్గర మేక వెంట్రుకలు ఉన్న ఒక విగ్రహం మంచం మీద కనబడింది.

17 అప్పుడు సౌలు, "నా శత్రువు తప్పించుకునేలా అతన్ని పంపించివేసి ఎందుకు నన్ను మోసం చేశావు?" అని మీకాలును అడిగాడు.

అందుకు మీకాలు, "నేనెందుకు నిన్ను చంపాలి? నన్ను వెళ్లనివ్వు" అని దావీదు తనతో అన్నాడని సౌలుతో చెప్పింది.

18 అలా దావీదు తప్పించుకుని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు దగ్గరకు వచ్చి సౌలు తనకు చేసినదంతా అతనికి చెప్పాడు. అప్పుడు అతడు అతనితో పాటు సమూయేలు బయలుదేరి నాయోతుకు వచ్చి అక్కడ నివసించారు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.