Pular para o conteúdo
Publicidade

1 సమూయేలు 2:1-10

హన్నా ప్రార్థన

1 హన్నా ప్రార్థనచేసి ఇలా అన్నది:

"నా హృదయం యెహోవాలో సంతోషిస్తుంది;

యెహోవాను బట్టి నా కొమ్ము పైకెత్తబడింది.

నా శత్రువులపై నా నోరు గొప్పలు పలుకుతుంది,

మీ విడుదలలో నాకు ఆనందము.

2 "యెహోవా లాంటి పరిశుద్ధుడు ఒక్కడూ లేడు;

మీరు తప్ప మరి ఎవరు లేరు;

మన దేవునిలాంటి ఆశ్రయదుర్గం లేదు.

3 "అంత గర్వంగా మాట్లాడకండి

మీ నోటిని గర్వంగా మాట్లాడనివ్వకండి,

ఎందుకంటే యెహోవా అన్నీ తెలిసిన దేవుడు

ఆయన మీ క్రియలను పరిశీలిస్తారు.

4 "శూరుల విల్లులు విరిగిపోయాయి,

కాని తడబడినవారు బలాన్ని పొందుకున్నారు.

5 తృప్తిగా భోజనం చేసినవారు ఆహారం కోసం కూలికి వెళ్తారు,

కాని ఆకలితో ఉన్నవారు ఇక ఆకలితో ఉండరు.

గొడ్రాలిగా ఉన్న స్త్రీ ఏడుగురు పిల్లలను కన్నది,

కాని అనేకమంది పిల్లలను కన్న స్త్రీ కృశించిపోతుంది.

6 "మరణాన్ని జీవాన్ని ఇచ్చేది యెహోవాయే;

పాతాళం క్రిందకు దింపేది పైకి లేవనెత్తేది ఆయనే.

7 పేదరికాన్ని ఐశ్వర్యాన్ని కలుగజేసేది యెహోవాయే;

తగ్గించేది హెచ్చించేది ఆయనే.

8 దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది

పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే;

వారిని అధికారులతో కూర్చునేలా చేసేది

ఘనత కలిగిన సింహాసనాన్ని స్వతంత్రింపజేసేది ఆయనే.

"భూమి పునాదులు యెహోవాకు చెందినవి;

ఆయన వాటి మీద లోకాన్ని నిలిపారు.

9 ఆయన తన నమ్మకమైన సేవకుల పాదాలను కాపాడతారు,

అయితే దుర్మార్గులు చీకటిలో మౌనులుగా చేయబడతారు.

"బలం వలన ఎవరూ గెలవలేరు;

10 యెహోవాను వ్యతిరేకించేవారు నాశనమవుతారు.

పరలోకం నుండి మహోన్నతుడు ఉరుములా గర్జిస్తారు;

భూదిగంతాలకు యెహోవా తీర్పు తీరుస్తారు.

"ఆయన తన రాజుకు బలాన్నిస్తారు

తాను అభిషేకించిన వాని కొమ్మును హెచ్చిస్తారు."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.