Pular para o conteúdo
Publicidade

1 తిమోతి పత్రిక 1:3-7

OTSA Telugu Contemporary Version

అబద్ధ బోధకులను వ్యతిరేకించడానికి నియమించబడిన తిమోతి

3 నేను మాసిదోనియా ప్రాంతానికి వెళ్తూ, నేను నిన్ను కోరిన విధంగా, నీవు ఎఫెసు పట్టణంలోనే ఉండి, అక్కడ సత్యానికి విరుద్ధమైన బోధలు చేస్తున్నవారిని అలా బోధించవద్దని, 4 కట్టుకథలపై అంతులేని వంశచరిత్రలపై శ్రద్ధ చూపవద్దని ఆజ్ఞాపించు. వీటన్నిటి వలన విశ్వాసంతో జరిగే దేవుని పని ముందుకు కొనసాగే బదులు వాగ్వివాదాలకు దారి తీస్తాయి. 5 ఈ ఆజ్ఞ యొక్క లక్ష్యం ప్రేమ; అది స్వచ్ఛమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, యథార్థమైన విశ్వాసం నుండి కలుగుతుంది. 6 కొందరు వీటిని విడిచిపెట్టి, అర్థంలేని మాటల్లో పడ్డారు. 7 వారు దేవుని ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలని అనుకుంటారు, కాని తాము మాట్లాడే వాటి గురించి లేదా తాము ఎంతో నమ్మకంగా నొక్కి చెప్పే వాటి గురించి వారికే తెలియదు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    3 నేను మాసిదోనియ వెళ్తున్నపుడు నీకు చెప్పినట్టుగా నువ్వు ఎఫెసులోనే ఉండు. భిన్నమైన సిద్ధాంతాలను బోధించే వారిని అలా చేయవద్దని నువ్వు ఆజ్ఞాపించాలి. 4 అంత మాత్రమే కాక కల్పనా కథలను, అంతూ పొంతూ లేని వంశావళులను పట్టించుకోవద్దని వారికి ఆజ్ఞాపించు. ఎందుకంటే అవి వివాదాలకు కారణమౌతాయే గాని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుకు ఎంత మాత్రమూ తోడ్పడవు. 5 ఈ హెచ్చరికలోని ఉద్దేశం పవిత్ర హృదయం నుండీ మంచి మనస్సాక్షి నుండీ యథార్థమైన విశ్వాసం నుండీ వచ్చే ప్రేమే.

    6 కొంతమంది వీటి నుండి తొలగిపోయి పనికిమాలిన కబుర్లకు దిగారు. 7 వారు మాట్లాడేవీ నొక్కి చెప్పేవీ వారికే అర్థం కాకపోయినా, ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలనుకుంటారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.