3 నిజంగా అవసరంలో ఉన్న విధవరాండ్రకు సరియైన గుర్తింపు ఇవ్వు. 8 ఎవరైనా తమ బంధువులకు, మరి ముఖ్యంగా తన సొంత కుటుంబీకుల అవసరాలను తీర్చలేకపోతే అలాంటివారు విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లే, వారు అవిశ్వాసుల కంటే చెడ్డవారు.
16 విశ్వాసురాలైన ఏ స్త్రీయైనా తన కుటుంబంలో ఉన్న విధవరాలి భారాన్ని సంఘంపై పెట్టకుండా, తానే అలాంటి వారికి సహాయపడుతూ ఉండాలి. అప్పుడు నిజంగా అవసరంలో ఉన్న విధవరాండ్రకు సంఘం సహాయం చేయ కలుగుతుంది.