Pular para o conteúdo
Publicidade

1 థెస్సలోనికయులకు 5:4-9

OTSA Telugu Contemporary Version

4 అయితే సహోదరీ సహోదరులారా, ఆ దినం దొంగలా మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి మీరు చీకటిలో లేరు. 5 మీరంతా వెలుగు సంతానం పగటి సంతానము. మనం చీకటికి లేదా రాత్రికి చెందినవారం కాదు. 6 కాబట్టి మనం నిద్రపోతున్న ఇతరుల్లా ఉండకుండా, మెలకువ కలిగి తెలివిగా ఉందాము. 7 నిద్రపోయేవారు రాత్రివేళ నిద్రపోతారు, మత్తులుగా ఉండేవారా రాత్రివేళ మత్తులై ఉంటారు. 8 అయితే మనం పగటికి చెందినవారం కాబట్టి తెలివి కలిగి, విశ్వాసం ప్రేమ అనే కవచాన్ని, రక్షణ పొందాలనే ఆ ఆశాభావాన్ని శిరస్త్రాణంగా ధరించుకొంటాము. 9 ఎందుకంటే దేవుడు మనల్ని ఉగ్రతను అనుభవించడానికి నియమించలేదు కాని, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే నియమించారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    4 సోదరులారా, ఆ రోజు దొంగలాగా మీ మీదికి రావడానికి మీరేమీ చీకటిలో ఉన్నవారు కాదు. 5 మీరంతా వెలుగు సంతానం, పగటి సంతానం. మనం రాత్రి సంతానం కాదు. చీకటి సంతానమూ కాదు. 6 కాబట్టి ఇతరుల్లాగా నిద్ర పోకుండా, అప్రమత్తంగా, మెలకువగా ఉందాం. 7 నిద్రపోయే వారు రాత్రుళ్ళు నిద్రపోతారు. తాగి మత్తెక్కేవారు రాత్రుళ్ళే మత్తుగా ఉంటారు. 8 విశ్వాసులమైన మనం పగటి వాళ్ళం కాబట్టి మనలను మనం అదుపులో ఉంచుకుందాము. విశ్వాసం, ప్రేమను కవచంగా, రక్షణ కొరకైన ఆశాభావాన్ని శిరస్త్రాణంగా ధరించుకుందాం.

    9 ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు రక్షణ పొందడానికే మనలను నియమించాడు గానీ ఉగ్రతను ఎదుర్కోడానికి కాదు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

1 Tessalonicenses
Ver todos os capítulos de 1 Tessalonicenses