Pular para o conteúdo
Publicidade

2 పేతురు పత్రిక 2:1-3,18,19

OTSA Telugu Contemporary Version

అబద్ధ బోధకులు, వారి నాశనం

1 అయితే మీలో అబద్ధ బోధకులు ఉన్నట్లుగానే, గతంలో కూడా ప్రజల మధ్యలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు రహస్యంగా నాశనకరమైన నియమాలను ప్రవేశపెడుతూ, తమను కొన్న సర్వాధికారియైన ప్రభువును కూడా తిరస్కరిస్తూ తమ మీదికి తామే వేగంగా నాశనాన్ని తెచ్చుకుంటారు. 2 చాలామంది వారి పోకిరి చేష్టలను అనుసరిస్తారు, వీరిని బట్టి సత్యమార్గంలో ఉన్నవారిని దూషిస్తారు. 3 ఈ బోధకులు దురాశతో కట్టుకథలు చెప్పి మిమ్మల్ని దోచుకుంటారు. వారికి పూర్వకాలమే ఇవ్వబడిన తీర్పు వారి మీదికే వస్తుంది, వారి నాశనం ఆలస్యం కాదు.

18 ఎందుకంటే, వారి మాటలు వట్టివి డాంబికమైనవి, వారు శరీర సంబంధమైన దురాశలు కలవారై, చెడు మార్గంలో జీవిస్తూ అప్పుడే తప్పించుకున్నవారికి పోకిరి చేష్టలను ఎరగా చూపించి ప్రలోభపెడతారు. 19 తామే దుర్నీతికి బానిసలై ఉండి, అలాంటి వారికి స్వాతంత్ర్యం ఇస్తామని చెప్తారు. ఎందుకంటే "ఒకరు దేని చేతిలో ఓడిపోతారో దానికే దాసులవుతారు."

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 గతంలో కూడా ఇశ్రాయేలీయుల్లో అబద్ధ ప్రవక్తలు ఉండేవారు. అదే విధంగా మీ మధ్య కూడా అబద్ధ బోధకులు లేస్తారు. వారు నాశనకరమైన విరుద్ధ సిద్ధాంతాలను రహస్యంగా ప్రవేశపెడుతూ, తమ కోసం వెల చెల్లించిన ప్రభువును కూడా నిరాకరిస్తారు. దాని ద్వారా తమ మీదికి తామే త్వరగా నాశనం తెచ్చుకుంటారు. 2 అనేక మంది వారి విచ్చలవిడితనాన్ని అనుకరిస్తారు. అందువల్ల సత్యమార్గానికి అపకీర్తి కలుగుతుంది. 3 ఈ అబద్ధ బోధకులు అత్యాశతో, కట్టు కథలతో తమ స్వలాభం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. వారికి విధించిన శిక్ష పూర్వకాలం నుండి వారికోసం సిద్ధంగా ఉంది. వారి నాశనం నిద్రపోదు.

    18 వారు పనికిమాలిన గొప్పలు మాట్లాడుతూ ఉంటారు. వారు చెడు మార్గంలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని తమ శరీర సంబంధమైన చెడు కోరికలతో వెనుదిరిగేలా ప్రేరేపిస్తారు.

    19 వారే స్వయంగా దుర్నీతికి బానిసలై ఉండి, ఇతరులకు స్వేచ్ఛ కలిగిస్తామని వాగ్దానం చేస్తారు. ఒక వ్యక్తిని ఏది జయిస్తుందో దానికి అతడు బానిస అవుతాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Pedro
Ver todos os capítulos de 2 Pedro