Pular para o conteúdo
Publicidade

2 పేతురు పత్రిక 3:8-10

OTSA Telugu Contemporary Version

8 కాని ప్రియ స్నేహితుల్లారా, ఈ ఒక్క విషయాన్ని మరువకండి: దేవుని దృష్టిలో ఒక రోజు వెయ్యి సంవత్సరాల్లా, వెయ్యి సంవత్సరాలు ఒక రోజులా ఉన్నాయి. 9 కొందరు అనుకుంటున్నట్లు ప్రభువు తన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఆలస్యం చేసేవాడు కాడు. ఎవరు నశించకూడదని, అందరు మారుమనస్సు పొందాలని మీ కోసం ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు.

10 కాని ప్రభువు దినం దొంగలా వస్తుంది. ఆకాశాలు మహాశబ్దంతో గతించిపోతాయి; మూలకాలు అగ్నిచేత నశించిపోతాయి, భూమి దానిలో చేయబడి ఉన్న సమస్తం లయమైపోతాయి.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    8 కాని ప్రియులారా, ఈ విషయం మరచిపోకండి. ప్రభువు దృష్టికి ఒక్క రోజు వెయ్యి సంవత్సరాలుగా, వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజుగా ఉంటాయి. 9 కొంతమంది అనుకుంటున్నట్టు ప్రభువు తాను చేసిన వాగ్దానాల విషయంలో ఆలస్యం చేసేవాడు కాదు గానీ అందరూ మారిన మనసుతో తిరిగి రావాలనీ, ఎవ్వరూ నశించ కూడదనీ కోరుతూ మీ పట్ల చాలా ఓర్పుతో ఉన్నాడు.

    10 అయితే, ప్రభువుదినం ఎవరికీ తెలియని విధంగా దొంగ వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు ఆకాశాలు మహా ఘోషతో గతించిపోతాయి. పంచభూతాలు మంటల్లో కాలిపోతాయి. భూమి, దానిలో ఉన్నవన్నీ తీర్పుకు గురౌతాయి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Pedro
Ver todos os capítulos de 2 Pedro