Pular para o conteúdo
Publicidade

2 రాజులు 4:5-7,32-35

5 ఆమె అతని దగ్గర నుండి వెళ్లి, తన కుమారులతో లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది. వారు ఆమె దగ్గరకు తెచ్చిన పాత్రలన్నిట్లో ఆమె నూనె పోస్తూ ఉంది. 6 పాత్రలన్నీ నిండినప్పుడు ఆమె తన కుమారునితో, "ఇంకొకటి తీసుకురా" అన్నది.

అతడు, "ఇంకొక పాత్ర లేదు" అని జవాబిచ్చాడు. అప్పుడు నూనె ప్రవాహం ఆగిపోయింది.

7 ఆమె వెళ్లి దైవజనునికి చెప్పగా అతడు, "వెళ్లు, ఆ నూనె అమ్మి, నీ అప్పు తీర్చుకో. మిగిలిన దానితో నీవు, నీ కుమారులు జీవనం కొనసాగించండి" అన్నాడు.

32 ఎలీషా ఇంటికి వెళ్లి తన మంచం మీద చనిపోయి ఉన్న బాలుని చూశాడు. 33 అతడు గదిలోకి వెళ్లి వారిద్దరే లోపల ఉండగా తలుపు మూసి యెహోవాకు ప్రార్థన చేశాడు. 34 తర్వాత మంచం ఎక్కి, బాలుని నోటి మీద తన నోరు, కళ్ల మీద తన కళ్లు, చేతుల మీద చేతులు ఉంచి బాలుని మీద పడుకున్నాడు. అతడు వాడి మీద బోర్లా పడుకున్నప్పుడు బాలుని శరీరంలో వేడి పుట్టింది. 35 ఎలీషా మంచం దిగి గదిలో ఒకసారి అటూ ఇటూ నడిచి మరలా మంచం ఎక్కి బాలుని మీద బోర్లా పడుకున్నప్పుడు బాలుడు ఏడుసార్లు తుమ్మి కళ్లు తెరిచాడు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.