Pular para o conteúdo
Publicidade

2 రాజులు 6:1-7

గొడ్డలి తేలుట

1 ప్రవక్తల బృందం వారు ఎలీషాతో, "చూడండి, మిమ్మల్ని కలుసుకునే ఈ స్థలం ఇరుకుగా ఉంది. 2 మీరు ఒప్పుకుంటే మేము యొర్దానుకు వెళ్లి తలా ఒక దూలం తీసుకువచ్చి మనం కలుసుకోవడానికి ఒక స్థలాన్ని కడతాం" అన్నారు.

ఎలీషా, "వెళ్లండి" అన్నాడు.

3 అప్పుడు వారిలో ఒకడు, "దయచేసి మీ దాసులైన మాతో కూడా రండి" అన్నాడు.

ఎలీషా, "నేను వస్తాను" అన్నాడు. 4 కాబట్టి అతడు వారితో వెళ్లాడు.

వారు యొర్దానుకు వెళ్లి చెట్లు నరకడం ప్రారంభించారు. 5 వారిలో ఒకడు చెట్టు నరుకుతుండగా గొడ్డలి ఊడి నీళ్లలో పడింది. అతడు, "అయ్యో, నా ప్రభువా! అది అద్దెకు తెచ్చుకున్నది!" అని కేక పెట్టాడు.

6 దైవజనుడు, "అది ఎక్కడ పడింది?" అని అడిగాడు. అది పడ్డ స్థలం అతడు చూపించగా ఎలీషా ఒక కర్రను నరికి అక్కడ విసరగా ఆ ఇనుప గొడ్డలి నీటిపై తేలింది. 7 అప్పుడతడు, "దాన్ని బయటకు తీయి" అన్నాడు. అతడు చేయి చాపి దాన్ని తీసుకున్నాడు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.