7 అప్పుడు నాతాను దావీదుతో, "ఆ మనిషివి నీవే! ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాను. సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించాను. 9 యెహోవా దృష్టికి చెడ్డదైన పనిని చేసి ఆయన మాటను ఎందుకు తృణీకరించావు? హిత్తీయుడైన ఊరియాను ఖడ్గంతో చనిపోయేలా చేసి అతని భార్యను నీ సొంతం చేసుకున్నావు. అమ్మోనీయుల ఖడ్గంతో అతడు చనిపోయేలా చేశావు.
13 అప్పుడు దావీదు నాతానుతో, "నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను" అన్నాడు.
అందుకు నాతాను, "యెహోవా నీ పాపాన్ని తొలగించారు. నీవు చావవు.