దావీదు ఇశ్రాయేలీయులకు రాజగుట
1 ఇశ్రాయేలు గోత్రాలన్నీ హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకు వచ్చి, "మేము నీ రక్తసంబంధులము. 2 గతంలో సౌలు మాపై రాజుగా ఉన్నప్పటికీ, ఇశ్రాయేలు సైన్యాన్ని నీవే నడిపించావు. యెహోవా నీతో, ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నీవు కాపరిగా ఉంటావు, వారిని పరిపాలిస్తావు’ అని చెప్పారు" అని అన్నారు.
3 ఇశ్రాయేలు పెద్దలందరు హెబ్రోనులో ఉన్న రాజైన దావీదు దగ్గరకు వచ్చినప్పుడు, రాజు హెబ్రోనులో యెహోవా ఎదుట వారితో ఒక ఒడంబడిక చేశాడు; వారు దావీదును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించారు.
4 దావీదు ముప్పై సంవత్సరాల వయస్సులో రాజై నలభై సంవత్సరాలు పరిపాలించాడు. 5 హెబ్రోనులో యూదా వారిని ఏడు సంవత్సరాల ఆరు నెలలు పరిపాలించగా యెరూషలేములో ఇశ్రాయేలు, యూదా వారిని ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.
యెరూషలేమును జయించిన దావీదు
6 యెబూసీయుల మీద దాడి చేయడానికి రాజు, అతని మనుష్యులు యెరూషలేముకు వెళ్లారు. దావీదు లోపలికి రాలేడని భావించిన యెబూసీయులు దావీదుతో, "నీవు లోపలికి రాలేవు; ఇక్కడున్న గ్రుడ్డివారు కుంటివారు నిన్ను తరిమివేస్తారు" అన్నారు. 7 అయినా దావీదు సీయోను కోటను స్వాధీనం చేసుకున్నాడు. దానిని దావీదు పట్టణం అంటారు.
9 దావీదు కోటలో నివాసం ఏర్పరచుకున్నాడు, దానికి దావీదు పట్టణం అని పేరు పెట్టాడు. అతడు మిద్దె నుండి ఆ స్థలం లోపల కోట కట్టించాడు.