12 "దేవుని మందసం ఇంట్లో ఉండడం వల్ల ఓబేద్-ఎదోము కుటుంబమంతటిని అతనికి ఉన్న వాటినన్నిటిని యెహోవా ఆశీర్వదించారు" అని రాజైన దావీదుకు తెలిసింది. దేవుని మందసాన్ని ఓబేద్-ఎదోము ఇంటి నుండి దావీదు పట్టణానికి ఉత్సాహంతో తీసుకురావడానికి దావీదు వెళ్లాడు. 14 దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును ధరించి తన శక్తంతటితో యెహోవా సన్నిధిలో నాట్యం చేశాడు. 15 ఇలా దావీదు, ఇశ్రాయేలీయులందరు ఆనందోత్సాహాలతో బూరల ధ్వనితో యెహోవా మందసాన్ని తీసుకువచ్చారు.
17 వారు యెహోవా మందసాన్ని తీసుకువచ్చి, దావీదు దాని కోసం వేసిన గుడారంలో దానిని ఉంచారు, దావీదు యెహోవా సన్నిధిలో దహనబలులు సమాధానబలులు అర్పించాడు.