Pular para o conteúdo
Publicidade

2 తిమోతి పత్రిక 2:1-6,11-13

యేసు క్రీస్తు యొక్క నమ్మకమైన సైనికుడు

1 నా కుమారుడా, క్రీస్తు యేసులోని కృప చేత బలపడుతూ ఉండు. 2 అనేకమంది సాక్షుల సమక్షంలో నేను నీకు నేర్పిన సంగతులను ఇతరులకు బోధించగల నమ్మకమైన వారికి అప్పగించు. 3 యేసు క్రీస్తు కోసం ఒక మంచి సైనికుని వలె నాతో పాటు కష్టాలను భరించు. 4 యుద్ధానికి వెళ్లే ఏ సైనికుడైన తన సాధారణ జీవన వ్యాపార విషయాల్లో ఇరుక్కుపోడు కాని, తనపై అధికారిని సంతోషపరచడానికి ప్రయత్నిస్తాడు. 5 అదే విధంగా ఒక క్రీడాకారుడు క్రీడానియమాల ప్రకారం పందెంలో పాల్గొంటేనే తప్ప విజయ కిరీటాన్ని పొందుకోలేడు. 6 అలాగే పంటలోని భాగం మొదటిగా పొందాల్సింది కష్టపడి పని చేసే రైతే.

11 ఈ మాట నమ్మదగింది:

మనం ఆయనతో పాటు చనిపోతే,

ఆయనతో పాటు మనం కూడా జీవిస్తాము;

12 మనం భరిస్తే,

ఆయనతో పాటు మనం కూడా ఏలుతాము.

మనం ఆయనను తిరస్కరిస్తే,

ఆయన కూడా మనల్ని తిరస్కరిస్తారు;

13 మనం నమ్మకంగా లేకపోయినా,

ఆయన నమ్మకంగానే ఉంటారు,

ఎందుకంటే ఆయన తనను తాను తిరస్కరించుకోలేరు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Timóteo
Ver todos os capítulos de 2 Timóteo