Pular para o conteúdo
Publicidade

ప్రకటన 13:11-15

OTSA Telugu Contemporary Version

భూమిలో నుండి వచ్చిన మృగం

11 దాని తర్వాత రెండవ మృగం భూమిలో నుండి రావడం నేను చూశాను. దానికి గొర్రెపిల్లను పోలిన రెండు కొమ్ములు ఉన్నాయి, కాని అది ఘటసర్పంలా మాట్లాడింది. 12 ఆ రెండవ మృగం మొదటి మృగానికి ఉన్న అధికారమంతటిని చెలాయిస్తూ, చనిపోయేంత గాయం నుండి స్వస్థపడిన ఆ మొదటి మృగాన్ని భూమి దాని నివాసులు ఆరాధించేలా చేసింది. 13 అది గొప్ప సూచనలు చేస్తూ, మనుష్యులు చూస్తున్నప్పుడే ఆకాశం నుండి భూమి మీద అగ్నిని కురిసేలా చేస్తుంది. 14 రెండవ మృగం మొదటి మృగం పక్షంగా దాని కోసం అద్భుతాలను చేస్తూ భూనివాసులందరినీ మోసగిస్తుంది. ఆ రెండవ మృగం ఖడ్గంతో గాయపడి బ్రతికిన ఆ మొదటి మృగం కోసం విగ్రహం చేయమని వారిని ఆదేశించింది. 15 అంతేకాక మొదటి మృగం యొక్క విగ్రహానికి ఊపిరి పోసి అది మాట్లాడేలా చేయడానికి, తద్వారా ఆ విగ్రహాన్ని పూజించని వారందరిని చంపించడానికి దానికి అధికారం ఇవ్వబడింది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    11 అప్పుడు భూమిలో నుండి మరో క్రూర మృగం పైకి రావడం చూశాను. వాడికి గొర్రెపిల్ల కొమ్ముల వంటి కొమ్ములు రెండు ఉన్నాయి. ఆ మృగం మహాసర్పంలాగా మాట్లాడుతూ ఉన్నాడు. 12 వాడు ప్రాణాంతకమైన దెబ్బ తగిలి పూర్తిగా నయమైన మొదటి క్రూర మృగానికున్న అధికారాన్ని, వాడి సమక్షంలో ఉపయోగిస్తూ ఉన్నాడు. తద్వారా ఆ మొదటి మృగాన్ని భూమీ, దానిలో నివసించే వారంతా పూజించేలా చేశాడు.

    13 వాడు అనేక చిత్ర విచిత్రాలు చేస్తున్నాడు. మనుషులంతా చూస్తుండగా ఆకాశం నుండి భూమికి అగ్ని రప్పించడం వంటి అద్భుతాలు చేస్తున్నాడు. 14 తనకు అనుమతి ఉన్నంత మేర తాను చేస్తున్న అద్భుతాలతో భూమిపై అందర్నీ మోసం చేస్తూ ఉన్నాడు. కత్తి దెబ్బ తిన్నా బతికే ఉన్న మొదటి క్రూరమృగానికి ఒక విగ్రహాన్ని స్థాపించాలని వాడు అందరికీ చెబుతూ ఉన్నాడు.

    15 పైగా ఆ మృగం విగ్రహానికి ప్రాణం పోసి అది మాట్లాడేలా చేయడానికీ, ఆ మృగం విగ్రహాన్ని పూజించని వారిని చంపడానికీ వాడికి అధికారం ఇవ్వడం జరిగింది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.