Pular para o conteúdo
Publicidade

ప్రకటన 18:2-4

OTSA Telugu Contemporary Version

2 అతడు గొప్ప స్వరంతో ఇలా అన్నాడు,

"బబులోను మహా పట్టణం కూలిపోయింది! కూలిపోయింది!18:2 యెషయా 21:9

అది దయ్యాలు సంచరించే స్థలంగా,

ప్రతి దుష్ట ఆత్మలు సంచరించే స్థలంగా,

ప్రతి అపవిత్ర పక్షి సంచరించే స్థలంగా,

ప్రతి మలినమైన అసహ్యమైన క్రూరమృగాలు సంచరించే స్థలంగా మారింది.

3 ఎందుకంటే ఆమె వ్యభిచార మద్యాన్ని త్రాగి

దేశాలన్నీ మత్తులయ్యాయి.

భూలోక రాజులు ఆమెతో వ్యభిచరించారు.

భూలోక వర్తకులు ఆమె ఇచ్చే అధిక విలాసాలతో ధనికులయ్యారు."

బబులోను తీర్పును తప్పించుకోవడానికి హెచ్చరిక

4 అప్పుడు పరలోకంలో నుండి మరొక స్వరం వినిపించింది:

" ‘నా ప్రజలారా! మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా’18:4 యిర్మీయా 51:45

ఆమెకు సంభవించే ఏ కీడు మీ మీదికి రాకుండా,

ఆమెలో నుండి బయటకు రండి;

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    2 అతడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా అన్నాడు.

    "బబులోను నాశనమైంది! బబులోను నాశనమైంది! అది దయ్యాలకు నివాసమైంది.

    ప్రతి అపవిత్రాత్మకూ ఉనికిపట్టు అయింది. అపవిత్రమూ అసహ్యమూ అయిన ప్రతి పక్షికీ గూడు అయింది.

    3 ఎందుకంటే దేవుని కోపాన్ని తెచ్చే దాని లైంగిక విశృంఖలతా మద్యాన్ని జనమంతా తాగి మత్తెక్కి పడిపోయారు.

    భూమి మీద రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. లోకంలో వ్యాపారులు ఆమె అధిక సుఖభోగాల ప్రభావం వల్ల సంపన్నులయ్యారు."

    4 తరువాత మరో స్వరం పరలోకం నుండి వినిపించింది. ఆ స్వరం ఇలా చెప్పింది.

    "నా ప్రజలారా, మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా, ఆమెకు సంభవించబోయే కీడుల్లో ఏదీ మీకు సంభవించకుండా ఆమెను విడిచి వచ్చెయ్యండి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.