Pular para o conteúdo
Publicidade

ప్రకటన 7:1-8

ముద్రింపబడినవారు 1,44,000

1 ఈ సంగతుల తర్వాత నలుగురు దూతలు భూమి నాలుగు మూలల్లో నిలబడి భూమిమీద గాని సముద్రం మీద గాని ఏ చెట్టు మీద గాని గాలి వీచకుండా నలుదిక్కుల నుండి గాలులను అడ్డగిస్తున్నారు. 2 అప్పుడు నేను మరొక దేవదూత జీవంగల దేవుని ముద్రను కలిగి తూర్పుదిక్కు నుండి పైకి రావడం చూశాను. ఆ దేవదూత భూమికి సముద్రానికి హాని కలిగించడానికి అనుమతిని పొందిన ఆ నలుగురు దూతలతో బిగ్గరగా, 3 "మేము మన దేవుని సేవకుల నుదుటి మీద దేవుని ముద్రను వేసే వరకు భూమికి కాని, సముద్రానికి కాని చెట్లకు కాని హాని చేయవద్దు" అని చెప్పడం నేను విన్నాను. 4 ఆ తర్వాత నేను వారి సంఖ్య చెప్తుంటే విన్నాను. ఇశ్రాయేలు ప్రజల గోత్రాలు అన్నిటిలో ముద్రింపబడినవారు 1,44,000:

5 యూదా గోత్రంలో 12,000;

రూబేను గోత్రంలో 12,000;

గాదు గోత్రంలో 12,000;

6 ఆషేరు గోత్రంలో 12,000;

నఫ్తాలి గోత్రంలో 12,000;

మనష్షే గోత్రంలో 12,000;

7 షిమ్యోను గోత్రంలో 12,000;

లేవీ గోత్రంలో 12,000;

ఇశ్శాఖారు గోత్రంలో 12,000;

8 జెబూలూను గోత్రంలో 12,000;

యోసేపు గోత్రంలో 12,000;

బెన్యామీను గోత్రంలో 12,000 ముద్రించబడ్డారు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.