Pular para o conteúdo
Publicidade

అపొస్తలుల కార్యములు 16:6-10

OTSA Telugu Contemporary Version

మాసిదోనియా గురించి పౌలుకు వచ్చిన దర్శనం

6 పౌలు అతనితో ఉన్నవారు ఫ్రుగియ, గలతీయ ప్రాంతాల గుండా ప్రయాణం చేసి ఆసియా ప్రాంతంలో వాక్యం బోధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ వారిని బోధించనియ్యలేదు. 7 ఆ తర్వాత వారు ముసియ ప్రాంత సరిహద్దు దగ్గరకు వచ్చి, బితూనియ ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు కానీ యేసు ఆత్మ వారిని వెళ్లనివ్వలేదు. 8 కాబట్టి వారు ముసియ ప్రాంతాన్ని దాటి త్రోయ పట్టణానికి వెళ్లారు. 9 రాత్రివేళలో కలిగిన దర్శనంలో మాసిదోనియకు చెందిన ఒక వ్యక్తి నిలబడి, "మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయండి" అని తనను బ్రతిమాలుతున్నట్లు పౌలు చూశాడు. 10 పౌలు ఆ దర్శనాని చూసిన తర్వాత, వారికి సువార్తను ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని నిర్ణయించుకొని, వెంటనే మాసిదోనియ ప్రాంతానికి వెళ్లడానికి మేము సిద్ధపడ్డాము.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    6 ఆసియా ప్రాంతంలో వాక్కు చెప్పవద్దని పరిశుద్ధాత్మ వారిని వారించాడు, అప్పుడు వారు ఫ్రుగియ, గలతీయ ప్రదేశాల ద్వారా వెళ్ళారు. ముసియ దగ్గరికి వచ్చి బితూనియ వెళ్ళడానికి ప్రయత్నం చేశారు గానీ 7 యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు.

    8 అందుకని వారు ముసియ దాటిపోయి త్రోయకు వచ్చారు. 9 అప్పుడు మాసిదోనియ వాసి ఒకడు కనిపించి, ‘నీవు మాసిదోనియ వచ్చి మాకు సహాయం చెయ్యి’ అని అతనిని పిలుస్తున్నట్టు రాత్రి సమయంలో పౌలుకు దర్శనం వచ్చింది. 10 అతనికి ఆ దర్శనం వచ్చినపుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియ బయలుదేరడానికి ప్రయత్నం చేశాము.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.