Pular para o conteúdo
Publicidade

అపొస్తలుల కార్యములు 2:1-4,16,17,38,41

పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దిగి వచ్చుట

1 పెంతెకొస్తు పండుగ రోజు వచ్చినప్పుడు, వారందరు ఒక్కచోట చేరుకొన్నారు. 2 అప్పుడు అకస్మాత్తుగా పరలోకం నుండి వేగంగా వీస్తున్న గాలి లాంటి ధ్వని వచ్చి వారు కూర్చున్న ఇల్లంతా నింపింది. 3 అగ్ని జ్వాలల్లాంటి నాలుకలు విభజింపబడి వారిలో అందరిపై నిలిచినట్లు వారు చూశారు 4 వారందరు పరిశుద్ధాత్మతో నింపబడి, ఆత్మ వారికి ఇచ్చిన సామర్థ్యంతో ఇతర భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు.

16 యోవేలు ప్రవక్త ఇలా చెప్పాడు:

17 " ‘దేవుడు ఇలా చెప్తున్నారు, చివరి రోజుల్లో,

నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.

మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు,

మీ యువకులు దర్శనాలు చూస్తారు,

మీ వృద్ధులు కలలు కంటారు.

38 అందుకు పేతురు, "మీలో ప్రతి ఒక్కరు, మీ పాపాల క్షమాపణ కోసం పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకొంటారు.

41 అతని సందేశాన్ని అంగీకరించినవారు బాప్తిస్మం పొందుకున్నారు, ఆ రోజు సుమారుగా మూడువేలమంది వ్యక్తులు సంఘానికి చేర్చబడ్డారు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.