Pular para o conteúdo
Publicidade

అపొస్తలుల కార్యములు 8:32-35

OTSA Telugu Contemporary Version

32 ఆ నపుంసకుడు చదువుతున్న లేఖనభాగం ఇది:

"ఆయన వధించబడడానికి తేబడిన గొర్రెవలె

బొచ్చు కత్తిరించే వాని దగ్గర గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు

ఆయన తన నోరు తెరవలేదు.

33 తన దీనత్వాన్ని బట్టి ఆయన న్యాయాన్ని కోల్పోయాడు.

ఆయన సంతానం గురించి మాట్లాడేవారు ఎవరు?

ఎందుకంటే భూమి మీద నుండి ఆయన ప్రాణం తీసివేయబడింది."8:33 యెషయా 53:7,8

34 ఆ నపుంసకుడు ఫిలిప్పును, "ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు, తన గురించా లేదా ఇంకొకరి గురించా? దయచేసి, నాకు చెప్పండి" అని అడిగాడు. 35 అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనంతో ప్రారంభించి, యేసును గురించిన సువార్తను అతనికి చెప్పాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    32 ఇతియోపీయుడు చదివే లేఖనభాగం ఏదంటే,

    ఆయనను గొర్రెలా వధకు తెచ్చారు.

    బొచ్చు కత్తిరించే వాడి దగ్గర

    గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టే,

    ఆయన నోరు తెరవలేదు.

    33 ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయం దొరకలేదు.

    ఆయన సంతతి గురించి ఎవరు వివరిస్తారు?

    ఎందుకంటే ఆయన ప్రాణాన్ని లోకం నుండి తీసేసారు.

    34 అప్పుడు ఆ నపుంసకుడు, "ప్రవక్త చెప్పేది ఎవరి గురించి? తన గురించా లేక వేరొక వ్యక్తిని గురించా? దయచేసి చెప్పు" అని ఫిలిప్పును అడిగాడు. 35 ఫిలిప్పు ఆ లేఖనంతో మొదలుపెట్టి యేసును గూర్చిన సువార్తను అతనికి బోధించాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.