3 వాటిని తీసుకుని అతడు ప్రయాణిస్తూ, దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా పరలోకం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. 4 అతడు నేల మీద పడిపోయి, ఒక స్వరం, "సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు?" అని అనడం విన్నాడు.
5 అందుకు సౌలు, "ప్రభువా, నీవెవరు?" అని అడిగాడు.
అప్పుడు ఆ స్వరం అతనితో, "నేను నీవు హింసిస్తున్న యేసును 6 నీవు లేచి పట్టణంలోనికి వెళ్లు, నీవు అక్కడ ఏం చేయాలో నీకు తెలుస్తుంది" అన్నది.
7 సౌలుతో పాటు ప్రయాణం చేస్తున్నవారు ఆ శబ్దాన్ని విన్నారు కాని మౌనంగా నిలబడిపోయారు, వారికి స్వరం వినబడింది కాని ఎవ్వరూ కనబడలేదు. 8 సౌలు నేల నుండి లేచి, కళ్లు తెరిచినప్పుడు ఏమి చూడలేకపోయాడు. కాబట్టి వారు అతని చేయి పట్టుకుని దమస్కు పట్టణంలోనికి నడిపించారు. 9 మూడు రోజులు చూపులేకుండా ఉన్నాడు, ఏమి తినలేదు త్రాగలేదు.