20 ఇలా అన్నాడు:
"దేవుని నామానికి ఎల్లప్పుడు స్తుతి కలుగును గాక;
జ్ఞానం, శక్తి ఆయనకే చెందుతాయి.
21 ఆయన కాలాలను, రుతువులను మారుస్తారు;
ఆయన రాజులను కూలగొట్టి ఇతరులను నియమిస్తారు.
ఆయన జ్ఞానులకు జ్ఞానాన్ని,
వివేకులకు వివేకాన్ని ఇస్తారు.
22 ఆయన లోతైన విషయాలను, రహస్యాలను బయలుపరుస్తారు;
చీకటిలో ఉన్నది ఆయనకు తెలుసు,
వెలుగు ఆయనతో నివసిస్తుంది.
23 నా పూర్వికుల దేవా, నేను మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను:
మీరు నాకు జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చారు,
మేము మిమ్మల్ని అడిగింది మీరు నాకు తెలియజేశారు,
రాజు కలను మీరు మాకు తెలియజేశారు."