Pular para o conteúdo
Publicidade

దానియేలు 2:27,28,31-35

27 దానియేలు జవాబిస్తూ ఇలా అన్నాడు, "రాజు అడిగిన మర్మం ఏ జ్ఞాని గాని, శకునాలు చెప్పేవాడు గాని, మాంత్రికుడు గాని, జ్యోతిష్యుడు గాని చెప్పలేడు. 28 అయితే మర్మాలు బయలుపరిచే ఒక దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయనే నెబుకద్నెజరు రాజుకు రాబోయే రోజుల్లో జరిగేది తెలియజేశారు. మీ మంచం మీద మీరు పడుకున్నప్పుడు మీ మనస్సులోనికి వచ్చిన మీ కల, మీ దర్శనాలు ఇవి:

31 "రాజా! మీరు మీ కలలో చూసినప్పుడు మీ ఎదుట ఒక బ్రహ్మాండమైన విగ్రహం ఉంది. అది గొప్పది, ప్రకాశమానమైన, భయంకరమైన ప్రతిమ. 32 ఆ ప్రతిమ తల మేలిమి బంగారంతో, దాని రొమ్ము, చేతులు వెండితో, దాని కడుపు, తొడలు ఇత్తడితో, 33 దాని కాళ్లు ఇనుముతో, దాని పాదాలు కొంత ఇనుము కొంత బంకమట్టితో చేయబడింది. 34 మీరు చూస్తుండగా, మనిషి చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి ఇనుము బంకమట్టితో ఉన్న ఆ విగ్రహం పాదాల మీద పడి వాటిని విరగ్గొట్టింది. 35 అప్పుడు ఇనుము, బంకమట్టి, ఇత్తడి, వెండి, బంగారం ముక్కలుగా విరిగిపోయి, వేసవికాలంలో నూర్పిడి కళ్ళం మీద పడే పొట్టులా అయ్యింది. జాడ తెలియలేనంతగా గాలి వాటిని ఈడ్చుకెళ్తుంది. అయితే ఆ విగ్రహాన్ని కొట్టిన ఆ రాయి మహా పర్వతంగా మారి భూమంతా నిండింది.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.