Pular para o conteúdo
Publicidade

దానియేలు 7:8,25

OTSA Telugu Contemporary Version

8 "నేను కొమ్ముల గురించి ఆలోచిస్తుండగా వాటి మధ్య నుండి మరొక చిన్న కొమ్ము పైకి వచ్చింది. మొదటి మూడు కొమ్ములు దాని ఎదుట నుండి పెరికివేయబడ్డాయి. ఈ కొమ్ముకు మనిషిలాంటి కళ్లు, గర్వంగా మాట్లాడే నోరు ఉన్నాయి.

25 అతడు సర్వోన్నతునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఆయన పరిశుద్ధులను హింసిస్తూ, పండుగ కాలాలను, శాసనాలను మార్చే ప్రయత్నం చేస్తాడు. పరిశుద్ధులు ఒక కాలం, కాలాలు, సగం కాలం7:25 లేదా ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, సగం సంవత్సరం అతని చేతికి అప్పగించబడతారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    8 నేను దాని కొమ్ములను కనిపెట్టి చూస్తుంటే ఒక చిన్న కొమ్ము వాటి మధ్య మొలిచింది. దానికి చోటు ఇవ్వడానికి ఆ కొమ్ముల్లో మూడింటిని పీకి వేశారు. ఈ కొమ్ముకు మనిషి కళ్ళ వంటి కళ్ళు, గర్వంగా మాటలాడే నోరు ఉన్నాయి.

    25 ఆ రాజు మహోన్నతుని దేవునికి విరోధంగా మాట్లాడుతూ,

    మహోన్నతుని భక్తులను నలగగొడతాడు.

    అతడు పండగ కాలాలను ధర్మవిధులను మార్చ బూనుకుంటాడు.

    వారు ఒక కాలం కాలాలు అర్థకాలం అతని వశంలో ఉంటారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.