దశమభాగాలు
22 ప్రతి సంవత్సరం మీ పొలాల్లో పండే పంటల్లో పదవ వంతును ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉంచాలి. 23 మీ దేవుడైన యెహోవాకు మీరు ఎల్లప్పుడు భయపడడం నేర్చుకునేలా మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలంలో మీ ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో, ఒలీవ నూనెలో దశమభాగాన్ని, పశువుల్లో, మందలలో మొదటి పిల్లల్లో పదవ దానిని యెహోవా సన్నిధిలో తినాలి. 26 ఆ వెండితో మీకు నచ్చిన వాటిని కొనండి: పశువులు, గొర్రెలు, ద్రాక్షరసం లేదా మద్యం లేదా మీకు నచ్చింది ఏదైన. తర్వాత మీరు మీ కుటుంబీకులు అక్కడే మీ దేవుడైన యెహోవా సన్నిధిలో వాటిని తిని సంతోషించాలి.
28,29 మీ దేవుడైన యెహోవా మీ చేతిపనిని ఆశీర్వదించేలా, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి, ఆ సంవత్సరం పండిన పంటలో దశమభాగాన్ని తెచ్చి మీ పట్టణాల్లో నిలువచేయాలి, తద్వార మీతో పాటు భాగం గాని వారసత్వం గాని లేని లేవీయులు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్రు వచ్చి భోజనం చేసి తృప్తిపొందుతారు.