జనుల దుష్టత్వాన్ని అనుసరించకూడదు
9 మీ దేవుడైన యెహోవా మీకిచ్చే దేశంలో మీరు ప్రవేశించాక అక్కడి దేశాల అసహ్యకరమైన మార్గాలను అనుకరించడం నేర్చుకోకండి. 10 తమ కుమారున్ని లేదా కుమార్తెను అగ్నిలో బలి ఇచ్చే వారినైననూ, భవిష్యవాణి లేదా మంత్రవిద్య, శకునాలను చెప్పు వారినైననూ, మంత్రవిద్యలో నిమగ్నమయ్యేవారునూ మీలో ఎవరూ కనబడకూడదు. 11 మంత్రాలు జపించేవారు గాని, ఆత్మలతో మాట్లాడేవారు గాని, చనిపోయినవారిని సంప్రదించేవారు గాని మీలో ఉండకూడదు. 12 ఇలాంటివి అభ్యసించేవారు యెహోవాకు అసహ్యులు; ఇలాంటి హేయక్రియలు చేస్తారు కాబట్టే యెహోవా మీ ముందు నుండి జనాలను వెళ్లగొడుతున్నారు.