17 న్యాయం విషయంలో విదేశీయులను గాని తండ్రిలేనివారిని గాని వంచించకండి లేదా విధవరాలి యొక్క వస్త్రాన్ని తాకట్టుగా తీసుకోకండి, 18 మీరు ఈజిప్టులో బానిసలుగా ఉన్నారని, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అక్కడినుండి విడిపించారని జ్ఞాపకముంచుకోండి. అందుకే ఇలా చేయండని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
19 మీరు మీ పొలంలో పంట కోసినప్పుడు, మీరు ఒక పనను పట్టించుకోకపోతే, దాన్ని తెచ్చుకోడానికి తిరిగి వెనుకకు వెళ్లవద్దు. మీ చేతుల యొక్క అన్ని పనులలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించేలా విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం వదిలేయండి. 20 మీరు మీ చెట్ల నుండి ఒలీవలను కొట్టినప్పుడు, రెండవసారి కొమ్మలపైకి వెళ్లవద్దు. విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం మిగిలి ఉన్నవాటిని వదిలేయండి. 21 మీరు మీ ద్రాక్షతోటలో ద్రాక్షను కోసినప్పుడు, మళ్ళీ తీగెల మీద వెదకవద్దు. మిగిలి ఉన్నవాటిని విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం వదిలేయండి.